చతుఃసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు……రామక పాండురంగ శర్మా అహం భోః అభివాదయే।
నా చిన్న నాడు మా గురువుగారు మాకు `రఘువంశః‘ ద్వితీయసర్గతో పాఠం మొదలు పెట్టారు. అంటే సంసృతాధ్యయనారంభం దీనితోటే అన్నమాట.
కవికుల గురువు కాళిదాసు రచించిన రఘువంశ కావ్యాన్ని తెలుగులో పాఠం చెప్పి, విద్యార్థులకు అందిస్తే…..నేను చదివిన చదువుకు కొంచెమైనా సార్థకత. ఆ విధంగా కొంత ఋషిఋణాన్ని తీర్చుకోవచ్చు. అందుకే ఈ బ్లాగ్ ఆరంభించాను.
నేనేదో అద్భుతంగా పాఠం చెబుతా అని చేస్తున్న పనికాదిది. నావంతు కర్తవ్యం ఏదో నెరవేర్చాలనే తపన మాత్రమే.
రఘూణా మన్వయం వక్ష్యే తనువాగ్విభవోsపి సన్।
తం సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తిహేతవః।
అయినా మీరు సలహాలు, సూచనలు వ్యాఖ్యాన రూపంలో తప్పక ఇవ్వండి. నా తర్వాతి పాఠాల్లో జాగ్రత్త పడుతాను. నా పాఠాలు విని ఆశీర్వదించండి.
మీకు ముంగిలి లో నేను రాసిన కొత్త పాఠం కనిపిస్తుంది. ఒకవేళ మీకు పాఠాలు మొదటినుండి కావాలంటే,పైన ఉన్న బొత్తాముల్లో `మొదటినుండి..‘ బొత్తామును నొక్కండి.
ఇంకా మీరు మాకు ఏమైనా చెప్పదలుచుకుంటే..`సంప్రదించండి‘ పై నొక్కండి.
మీకు కేశవపంతులవారి తెలుగు వ్యాఖ్యానంతో రఘువంశ కావ్యం దిగుమతికి కింది లంకెల్లో లభిస్తాయి.
అన్నట్టు, ఈ జాలగూడు (Website) గురించి మీ సాంఘికసంపర్కజాలా(Social Networks)ల్లో పదిమందికి తెలియజేయండి.